పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ కీలక సూచనలు
- 2020-21 మదింపు సంవత్సరానికి రిఫండ్లపై స్పందించాలి
- నోటీసులకు పన్ను చెల్లింపుదారులు వెంటనే సమాధానమివ్వాలి
- రిఫండ్‌లు చెల్లించేందుకు వీలవుతుంది
కొందరు ఐటీఆర్ దాఖలు చేయడంతో అక్కడితో ఈ ప్రక్రియ ముగిసిందని భావిస్తుంటారు. అయితే, ఆ ఐటీఆర్‌లో ఏవైనా సందేహాలు ఉంటే ఆన్‌లైన్‌లోనే పన్ను చెల్లింపుదార్లు తమ ప్రశ్నలను నివృత్తి చేసుకోవచ్చని, వారు ఎంత త్వరగా స్పందన తెలియజేస్తే రిఫండ్‌లు అంత త్వరగా వస్తాయని పేర్కొంది. కాగా, 2020-21 మదింపు సంవత్సరానికి గత వారం మొత్తం రూ.15,269 కోట్ల రిఫండ్‌లు చేసినట్లు ఇప్పటికే ఐటీ శాఖ వివరించింది.