వైసీపీ నేతలకు సవాలు విసిరిన అచ్చెన్నాయుడు
- ఉత్తరాంధ్ర ప్రాంతానికి టీడీపీ ఏం చేసిందో చెబుతాం
- వైసీపీ ఏం చేసిందో చెప్పండి
- అభివృద్ధి చేయలేకే మూడు రాజధానుల అంశం తెరపైకి
అభివృద్ధి చేయలేకే జగన్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆయన విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యలను ఈ ప్రాంత మంత్రులు జగన్ వద్ద ప్రస్తావించగలరా? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. విశాఖ మెడ్‌టెక్ జోన్‌పై గతంలో ఆ పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో అదే ప్రజల ప్రాణాలు కాపాడిందని ఆయన చెప్పారు.