Bandi Sanjay: మెహిదీపట్నంలోని ఫార్మసీ కాలేజీలో బీజేపీ కీల‌క నేత‌ల‌తో బండి సంజ‌య్ స‌మావేశం

bandi sanjay meets bjp leaders
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న‌ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే పాదయాత్ర కోసం బీజేపీ ప్రణాళికలు రూపొందించి ఏర్పాట్లు చేసుకుంది. నిన్న హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌ మీదుగా మెహిదీపట్నం వరకు పాద‌యాత్ర కొన‌సాగింది.

నిన్న‌ రాత్రి బండి సంజ‌య్‌తో పాటు ప‌లువురు నేతలు మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో బస చేశారు. ఈ రోజు అదే కాలేజీలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరుగుతోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ‌, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్యేలు, త‌దిత‌రులు ఇందులో పాల్గొన్నారు. పాద‌యాత్ర నిర్వ‌హ‌ణ‌తో పాటు పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బ‌ల‌ప‌ర్చే అంశాల‌పై బీజేపీ నేత‌ల‌కు బండి సంజ‌య్ దిశానిర్దేశం చేస్తున్నారు.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
Telangana

More Telugu News