'అనుభవించు రాజా' నుంచి ఫస్టులుక్!
- అన్నపూర్ణ బ్యానర్లో 'ఆనుభవించురాజా'
- కథానాయకుడిగా రాజ్ తరుణ్
- రేపు నాగార్జున పుట్టినరోజు
- ఈ సందర్భంగా వదిలిన ఫస్టులుక్ పోస్టర్
కథాప్రకారం ఈ సినిమాలో హీరో జల్సా పురుషుడిలా కనిపిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథనడవనుందని తెలుస్తోంది. అక్కడ జాతర వాతావరణం .. హీరోకి పేక .. కోడి పందాలు ఆడే అలవాటు ఉందనే విషయాన్ని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. హీరో బంగారు ఉంగరాలు .. బ్రేస్ లెట్ పెట్టేసి శ్రీమంతుడిలా కనిపిస్తున్నాడు.
'ఉయ్యాలా జంపాలా' సినిమాతో రాజ్ తరుణ్ ను హీరోగా పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ వారు, మళ్లీ ఇప్పుడు ఆయనతో ఈ సినిమాను చేస్తున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.