కేసీఆర్ పీఠాలు కదులుతాయ్: కిషన్ రెడ్డి

BJP will win in Huzurabad says Kishan Reddy
  • హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
  • ఉపఎన్నికలో గెలిచేది బీజేపీనే
  • అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం బీజేపీదే
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచేది బీజేపీనే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బండి సంజయ్ పాదయాత్రతో కేసీఆర్ పీఠాలు కదులుతాయని చెప్పారు. హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని చెప్పారు.
Go Back to Shorts
Kishan Reddy
BJP
KCR
TRS

More Telugu News