కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

Tamil Nadu assembly passes resolution against new farm laws
  • కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత
  • ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు
  • ఈ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందన్న స్టాలిన్
వ్యవసాయ రంగంలో సమూల మార్పులను తీసుకొస్తున్నామంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లోక్ సభ, రాజ్యసభలో ఈ బిల్లులకు తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ... బిల్లులను కేంద్రం ఆమోదింపజేసుకుంది. అనంతరం ఈ మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపడంతో అవి చట్టరూపం దాల్చాయి.

అప్పటినుంచీ ఈ కొత్త వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాపంగా వివిధ రాజకీయ పార్టీలతో పాటు, రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయి.

తాజాగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కూడా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సీఎం స్టాలిన్ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రైతుల హక్కులకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయని, అందువల్ల ఈ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని స్టాలిన్ ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలో ధర్నాకు దిగారు.
Go Back to Shorts
Tamilnadu
Assembly
New Farm Laws
Stalin
DMK
BJP

More Telugu News