మల్లన్నసాగర్ నీటితో నిండటంపై కేసీఆర్ సంతోషం
- కరీంనగర్‌లో నేడు దళిత బంధుపై సమీక్ష
- సమావేశం అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
- మార్గమధ్యంలో హెలికాప్టర్ నుంచి మల్లన్నసాగర్ వీక్షణం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జలాశయాల్లో మల్లన్నసాగర్ అతిపెద్దది. 50 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఈ నిర్మాణ పనులన్నీ ఇటీవలే పూర్తయ్యాయి. దీంతో ఈ ఏడాదే దీన్ని కాళేశ్వరం జలాలతో నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా నీటిని ఈ జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. ఈ దృశ్యాలనే తన హెలికాప్టర్ నుంచి సీఎం కేసీఆర్ పరిశీలించారు. మల్లన్నసాగర్ జలాశయం నీటితో నిండటాన్ని చూసి సంతోషం వ్యక్తంచేశారు.