ఇంగ్లండ్ ఆలౌట్.. టీమిండియాపై భారీ ఆధిక్యత సాధించిన ఆతిథ్య జట్టు
- తొలి ఇన్నింగ్స్ లో 432 పరుగులు చేసిన ఇంగ్లండ్
- 354 పరుగుల ఆధిక్యతను సాధించిన ఇంగ్లండ్
- నాలుగు వికెట్లు తీసిన షమీ
కాసేపటి క్రితం ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ప్రారంభించారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 7 ఓవర్లకు 13 పరుగులు. రోహిత్ 8, రాహుల్ 5 పరుగులతో ఆడుతున్నారు. భారత్ 341 పరుగులు వెనుకబడి ఉంది.