భావోద్వేగంలో కన్నీళ్లు వచ్చేశాయి: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh gets emotional
  • చాలా రోజుల తర్వాత థియేటర్ లో సినిమా చూశా
  • స్క్రీన్ పై టైటిల్స్ పడటం ప్రారంభమైన వెంటనే భావోద్వేగానికి గురయ్యా
  • క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్లలో సినిమా విడుదల చేసిన అక్షయ్, టీమ్ కు అభినందనలు
ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. దక్షిణాది సినిమాలే కాకుండా బాలీవుడ్ సినిమాలతో కూడా ఆమె బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి థియేటర్ లో సినిమా చూసింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'బెల్ బాటమ్' ను వీక్షించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.

చాలా నెలల తర్వాత థియేటర్లో సినిమా చూడటం సంతోషంగా ఉందని రకుల్ చెప్పింది. స్క్రీన్ పై టైటిల్స్ పడటం ప్రారంభమైన వెంటనే భావోద్వేగానికి గురయ్యానని తెలిపింది. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నానని చెప్పింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్ లో సినిమా విడుదల చేసిన అక్షయ్ కుమార్, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

మరోవైపు డ్రగ్స్ కేసు విచారణకు హాజరు కావాలంటూ రకుల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆమెతో పాటు మరో 11 మంది టాలీవుడ్ ప్రముఖులకు సమన్లు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 6న ఈడీ ఎదుట ఆమె విచారణకు హాజరు కావాల్సివుంది.
Go Back to Shorts
Rakul Preet Singh
Bollywood
Emotional
Tollywood

More Telugu News