Alaska Airlines: స్మార్ట్‌ఫోన్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. అలాస్కా విమానం అత్యవసర ల్యాండింగ్

  • 128 మందితో న్యూ ఓర్లీన్స్ నుంచి సీటెల్ వెళ్తున్న విమానం
  • సీటెల్-టకోమా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
  • కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
Passengers Injured as Smoke Fills Cabin of Alaska Airlines Flight

128 మంది ప్రయాణికులతో న్యూ ఓర్లీన్స్ నుంచి సీటెల్‌ వెళ్తున్న అలాస్కా 751 విమానంలోని ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సెల్‌ఫోన్‌లో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వాటిని అదుపు చేశారు. అనంతరం విమానాన్ని సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలోని 128 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బస్సులో తరలించారు. మంటలు చెలరేగిన స్మార్ట్‌ఫోన్ పూర్తిగా దగ్ధమైంది.

More Telugu News