తెలంగాణలో కొత్తగా 389 మందికి కరోనా

Telangana covid details
  • గత 24 గంటల్లో 88,347 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 70 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 6,276 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 88,347 కరోనా పరీక్షలు నిర్వహించగా, 389 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 70 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 36, నల్గొండ జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 420 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,55,732 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,45,594 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,276 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,862కి చేరింది. కరోనా మరణాల రేటు జాతీయస్థాయిలో 1.3 శాతం ఉండగా, తెలంగాణలో 0.58 శాతానికి దిగొచ్చింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
New Cases
Deaths

More Telugu News