ఆఫ్ఘన్‌లోని పంజ్‌షీర్ లో పోరు ఉద్ధృతం.. 300 మంది తాలిబన్లను చంపేశామన్న సైన్యం!
- భారీగా పంజ్‌షీర్ వైపునకు వెళుతోన్న తాలిబన్లు
- ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు
- తాలిబన్ల చర్యలను సమర్థంగా తిప్పికొడుతోన్న సైన్యం
ఈ క్రమంలో ఇప్పుడు తాలిబన్లు పంజ్‌షీర్ వైపునకు పెద్ద ఎత్తున ఆయుధాలతో బయలుదేరారు. దీంతో పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు తాలిబన్లు ప్రయత్నాలు జరపడంతో వారి చర్యలను సైన్యం, ప్రజలు తిప్పికొట్టారు. దాదాపు 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు పంజ్‌షీర్ సైన్యం ప్రకటన చేసింది. మరోపక్క, భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపునకు మరికొంతమంది తాలిబన్లు కదులుతున్నారు.