స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

Petrol diesel prices cut by 20 paise
  • పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు 20 పైసల తగ్గింపు
  • వారంలో నాలుగుసార్లు తగ్గిన డీజిల్ ధర
  • జులై 17న చివరిసారి పెరిగిన ఇంధన ధరలు
పెట్రోలు, డీజిల్ ధరలు నిన్న స్వల్పంగా తగ్గాయి. చమురు సంస్థలు ఈ రెండింటిపైనా లీటరుకు 20 పైసల చొప్పున తగ్గించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ఇంధన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్ ధర తగ్గడం వారంలో ఇది నాలుగో సారి కాగా, పెట్రోలు ధర తగ్గడం ఇదే తొలిసారి. గత నెల 17న చివరిసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలోనే చమురు సంస్థలు ధరల పెంపు జోలికి పోలేదని తెలుస్తోంది. తాజాగా ధరల తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 101.64కు, డీజిల్ ధర రూ. 89.07కు తగ్గింది.
Go Back to Shorts
Petrol
Diesel
Price
India

More Telugu News