కల్యాణ్ సింగ్ మృతి నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర వాయిదా
- యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కన్నుమూత
- పాదయాత్ర వాయిదావేసుకున్న బండి సంజయ్
- త్వరలోనే కొత్త తేదీ ప్రకటన
- కల్యాణ్ సింగ్ మృతికి సంతాపదినాలు
కల్యాణ్ సింగ్ మృతి తీరని లోటు అని, పార్టీ తరఫున సంతాప దినాలు పాటిస్తామని బండి సంజయ్ వివరించారు. కల్యాణ్ సింగ్ క్రమశిక్షణకు మారుపేరు అని వెల్లడించారు. బండి సంజయ్ ఆగస్టు 24 నుంచి పాదయాత్ర చేసేందుకు ఇటీవల నిర్ణయించారు. పాదయాత్ర వాయిదా పడిన నేపథ్యంలో కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.