ఆ విమానంలో ప్రయాణించినది 640 మంది కాదు.. 823 మంది: ఎయిర్ మొబిలిటీ కమాండ్
- కిక్కిరిసి ప్రయాణించిన సి-17 విమానం
- ప్రయాణికుల ఒళ్లో కూర్చుని మరో 183 మంది ప్రయాణం
- సి-17లో ఒకేసారి ఇంతమంది ప్రయాణం ఇదో రికార్డు
అయితే, నిజానికి ఈ విమానంలో ప్రయాణించినది 640 మంది కాదని, 823 మంది ప్రయాణించారని ఎయిర్ మొబిలిటీ కమాండ్ వెల్లడించింది. నిజానికి విమానంలో కూర్చున్న 640 మందినే లెక్కపెట్టామని, పెద్దల ఒళ్లో కూర్చుని మరో 183 మంది చిన్నారులు కూడా ప్రయాణించారని తాజాగా తెలిపింది. సి-17 విమానంలో ఒకేసారి ఇంతమంది ప్రయాణించడం ఇదో రికార్డని పేర్కొంది.