విజయనగరం జిల్లాలో యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై సీఎం జగన్ ఆరా
- కాబోయే భార్యకు నిప్పంటించిన యువకుడు
- మరో యువకుడితో మాట్లాడుతోందని ఆగ్రహం
- చికిత్స పొందుతున్న యువతి
- బాధితురాలిని విశాఖ తరలించాలన్న సీఎం జగన్
బాధితురాలికి మరింత మెరుగైన వైద్యం అందించాలని, ఆమెను విశాఖ తరలించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో బాధితురాలు రాములమ్మను విశాఖ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అటు, ఈ వ్యవహారంలో సీఎం జగన్ మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా దిశానిర్దేశం చేశారు. రాములమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించాలని, వారికి అండగా నిలవాలని తెలిపారు. బాధితురాలికి అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తుండాలని స్పష్టం చేశారు.
సీఎం ఆదేశాలతో బొత్సతో పాటు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, అధికారులు బాధితురాలిని పరామర్శించారు. కాగా, ఈ ఘటనలో బాధితురాలితో పాటు ఆమె సోదరి, సోదరి కుమారుడికి కూడా గాయాలయ్యాయి.