బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనట!
- ముగింపు దశలో 'అఖండ'
- అక్టోబర్ 8న రిలీజ్ అంటూ టాక్
- అక్టోబర్ 1 నుంచి కొత్త ప్రాజెక్టు మొదలు
- దర్శకుడిగా గోపీచంద్ మలినేని
మొదటి నుంచి కూడా ఈ సినిమాను దసరా రోజుల్లో విడుదల చేయాలనే అనుకున్నారు. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు ఒక వారం రోజులు ముందుగానే బాలయ్య కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది.
బాలకృష్ణ తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేనితో చేయనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన సెట్స్ పైకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. అప్పటికి గోపీచంద్ మలినేని అన్ని పనులను పూర్తి చేసి రెడీగా ఉంటాడన్న మాట. ఈ సినిమాలో కథానాయికలుగా శ్రుతి హాసన్ .. త్రిష .. శ్రియ పేర్లు వినిపిస్తున్నాయి.