Suthapalli Devi: యూరప్ లోని ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించిన కాకినాడ యువతి

Kakinada girl Suthapalli Devi climbs Mount Elbrus
షార్ట్స్‌లో చూడండి
రష్యాలోని మౌంట్ ఎల్ బ్రస్ ను యూరప్ ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వత శిఖరంగా భావిస్తారు. కాకసస్ పర్వతశ్రేణిలో ఉండే ఎల్ బ్రస్ శిఖరం ఎత్తు 5,642 మీటర్లు. ఇంతటి సమున్నత పర్వతాన్ని ఓ తెలుగుమ్మాయి అధిరోహించడం విశేషం.

ఏపీలోని కాకినాడకు చెందిన సుతాపల్లి దేవి మౌంట్ ఎల్ బ్రస్ ను కేవలం 4 రోజుల్లోనే అధిరోహించి ఔరా అనిపించింది. ఈ 23 ఏళ్ల అమ్మాయి ఎల్ బ్రస్ శిఖరాగ్రాన భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అందరి దృష్టిని ఆకర్షించింది. అది కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడే ఆమె అధిరోహణ పూర్తికావడం చిరస్మరణీయ ఘట్టం. ట్రెక్కింగ్ అంటే ఎంతో ఆసక్తిచూపించే ఈ కాకినాడ యువతి తాజాగా ఎల్ బ్రస్ ను అధిరోహించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.
Go Back to Shorts
Suthapalli Devi
Mount Elbrus
Russia
Europe
Kakinada
Andhra Pradesh
India

More Telugu News