తెలంగాణలో కొత్తగా 420 కొవిడ్ పాజిటివ్ కేసులు

Telangana covid positive cases update
  • గత 24 గంటల్లో 87,355 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 71 కేసులు
  • మూడు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 7,606 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 87,355 కరోనా పరీక్షలు నిర్వహించగా, 420 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 71 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 47, వరంగల్ అర్బన్ జిల్లాలో 39 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 623 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,52,135 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,40,688 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 7,606 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,841కి చేరింది.
Go Back to Shorts
Telangana
COVID19
New Cases
Deaths

More Telugu News