హుజూరాబాద్ టీఆర్ఎస్‌దే.. సర్వేలు మాకే అనుకూలం: కేసీఆర్
- ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన గెల్లు శ్రీనివాసయాదవ్
- కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానని ధీమా
- టీఆర్ఎస్‌పై ప్రజాభిమానాన్ని చాటే గొప్ప అవకాశం వచ్చిందన్న కేసీఆర్
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో యువ సత్తా చాటి గులాబీ జెండాను ఎగురవేయాలని శ్రీనివాసయాదవ్‌కు సూచించారు. టీఆర్ఎస్‌పై ప్రజాభిమానాన్ని తెలియజెప్పేందుకు వచ్చిన చక్కని అవకాశమే హుజూరాబాద్ ఉప ఎన్నిక అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.