అంత్యక్రియలకు డబ్బు లేక తాత మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచిన మనవడు!
- వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఘటన
- మనవడు నిఖిల్ తో కలిసి జీవిస్తున్న బాలయ్య
- బాలయ్య రిటైర్డ్ ఉద్యోగి
- కొన్నిరోజుల కిందట మృతి
అయితే ఇటీవల బాలయ్య మరణించారు. ఏంచేయాలో తెలియక ఆ వృద్ధుడి మృతదేహాన్ని నిఖిల్ తమ ఫ్రిజ్ లో దాచాడు. అయితే వారి ఇంటినుంచి భరించలేని దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు వచ్చి నిఖిల్ ను ప్రశ్నించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.