తనపై పోటీ చేసి గెలవాలంటూ కేసీఆర్, హరీశ్‌రావులకు ఈటల సవాల్
- నేను మచ్చలేని వ్యక్తిని, కక్షగట్టి తప్పించారు
- ఎన్నికోట్లు ఖర్చు చేసినా ప్రజల హృదయాల నుంచి నన్ను తుడిచేయలేరు
- హుజూరాబాద్‌లో నా గెలుపును ఆపలేరు
ఓటుకు రూ. 10 వేలు ఇచ్చినా సరే ప్రజల గుండెల్లోంచి తనను తుడిచేయలేరని స్పష్టం చేశారు. ఉరుములు వచ్చినా, పిడుగులు పడినా తన గెలుపును ఎవరూ ఆపలేరని ఈటల ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని, అయినా ఫర్వాలేదని, ఎన్నికల్లో చూసుకుందామని అన్నారు. ముఖ్యమంత్రి మాటల్లో, చేతల్లో నిజాయతీ లేదన్న ఈటల.. న్యాయబద్ధంగా పోటీ చేస్తే వారికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. తాను మచ్చలేని వ్యక్తినని, కక్ష గట్టి తనను తప్పించారని ఆరోపించారు.