శరద్ పవార్‌ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ.. పోరాటానికి మద్దతు ఇవ్వాలని వినతి
- శరద్ పవార్‌కు వినతిపత్రం సమర్పించిన పోరాట కమిటీ నేతలు
- స్టీల్‌ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలని అభ్యర్థన
- ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన శరద్ పవార్
సొంత గనులు లేకున్నా నాణ్యమైన ఉక్కును అందిస్తోందని, ఈ పరిశ్రమపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన శరద్ పవార్.. ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చకు పెడతామని, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోరాట నేతలు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ షణ్ముగం, బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు శ్రీరాంజీలను కలిసి మద్దతు కోరారు.