ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిల హాకీ జట్టు.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన వైనం!
- నేటి మ్యాచ్‌లో విజయం
- మూడుసార్లు ఒలింపిక్స్ ఛాంపియన్ గా నిలిచిన ఆసీస్‌పై గెలుపు
- 1980 తర్వాత అంతటి అద్భుత గెలుపు
ఆసీస్‌ను ఓడించడం ద్వారా సెమీస్ లోకి అడుగుపెట్టారు. మూడుసార్లు ఒలింపిక్స్ ఛాంపియన్ గా నిలిచిన ఆసీస్‌ను ఓడించడం మామూలు విషయం కాదు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆసీస్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా భారత్ ఆడింది. ఆస్ట్రేలియా మహిళల జట్టుపై 1-0 తేడాతో భారత్ గెలిచింది. 1980 తర్వాత భారత మహిళల జట్టు ఒలింపిక్స్ లో మళ్లీ అంతటి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు 4వ స్థానంలో నిలిచింది.