జులైలో పెరిగిన భక్తుల తాకిడి.. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 55.55 కోట్లు
- తిరుమలకు మళ్లీ పెరిగిన భక్తుల తాకిడి
- జులైలో శ్రీవారిని దర్శించుకున్న 5,32,780 భక్తులు
- 2,55,283 మంది తలనీలాల సమర్పణ
గత నెలలో 5,32,780 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2,55,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, శ్రీవారికి గత నెలలో రూ. 55.55 కోట్ల హుండీ ఆదాయం లభించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.