జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల నేడే... 10.7 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
- రూ. 693.81 కోట్ల నిధులను విడుదల చేయనున్న సీఎం
- విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధుల జమ
- ఏప్రిల్ 19న తొలి విడత నిధులను విడుదల చేసిన ప్రభుత్వం
ఈ పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సుల ఫీజుల్ని నాలుగు విడతల్లో చెల్లించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 19న తొలి విడతను విడుదల చేయగా... ఈ రోజు రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. డిసెంబరులో మూడో విడత, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. విద్యారంగానికి సంబంధించి ఇప్పటి వరకు రూ. 26,677 కోట్ల నిధులను ఖర్చు చేశామని చెప్పింది.