కడప జిల్లాలో దారుణం.. వైసీపీ సర్పంచ్ హత్య
- శిక్షణ తరగతులకు హాజరై వస్తున్న సమయంలో ఘటన
- గ్రామ శివారులో కాపుకాసి నరికి చంపిన ప్రత్యర్థులు
- ఆధిపత్య పోరులో భాగమేనంటున్న పోలీసులు
గ్రామ శివారులో ఆయనను అడ్డుకున్న ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మునెప్ప 150 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.