తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద మంత్రి వెల్లంపల్లికి రాజధాని రైతుల సెగ!
- శివస్వామి ఆశీస్సుల కోసం వచ్చిన వెల్లంపల్లి
- వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించిన రైతులు
- పోలీసుల అనుమతి నిరాకరణ
- మంత్రికి వ్యతిరేకంగా రైతుల నినాదాలు
అయితే, మంత్రిని కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెల్లంపల్లి దేవాదాయ మంత్రి అయ్యాక ఆలయాలపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిస్టిర్ డౌన్ డౌన్... వెల్లంపల్లి రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, మంత్రి వెల్లంపల్లి పోలీసుల రక్షణ నడుమ కారెక్కి వెళ్లిపోయారు.