Sensex: దూసుకుపోయిన మార్కెట్లు.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

Sensex gains 638 points
షార్ట్స్‌లో చూడండి
గత రెండు సెషన్లుగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో వాళ్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 638 పాయింట్లు లాభపడి 52,837కి పెరిగింది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 15,824 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (5.65%), బజాజ్ ఫైనాన్స్ (4.21%), భారతి ఎయిర్ టెల్ (3.93%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.72%), టాట్ స్టీల్ (3.27%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-2.27%), ఏసియన్ పెయింట్స్ (-1.73%), బజాజ్ ఆటో (-1.32%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.12%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News