కాంగ్రెస్ పార్టీ పతనమవుతున్నప్పటికీ... మా గురించి ఆందోళన చెందుతోంది: మోదీ
- బీజేపీ అధికారంలో ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది
- కాంగ్రెస్ ఏమీ చేయలేదనే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు
- అధికారం కోసమే ఉన్నామనే భ్రమల్లో కాంగ్రెస్ ఉంటుంది
60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదనే కారణంతోనే బీజేపీకి దేశ ప్రజలు పట్టం కట్టారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని మోదీ చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ... ఆ పని చేయడం లేదని అన్నారు. అధికారం కోసమే తమ పార్టీ ఉందనే భ్రమల్లో కాంగ్రెస్ ఉంటుందని, ప్రజా తీర్పును కూడా ఆ పార్టీ పట్టించుకోదని విమర్శించారు. పతనావస్థలో ఉన్న తమ పార్టీ గురించి కాకుండా, ఎప్పుడూ బీజేపీ గురించి అది ఆందోళన చెందుతుంటుందని ఎద్దేవా చేశారు.