తెలంగాణలో కరోనా తగ్గుముఖం... 600కి దిగువన కొత్త కేసులు
- గత 24 గంటల్లో 578 పాజిటివ్ కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 75 కేసులు
- రెండు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- 10 వేలకు దిగువన యాక్టివ్ కేసులు
అదే సమయంలో 731 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,36,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,23,044 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,824 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,759కి పెరిగింది.
