నిరుద్యోగ సంఘాల 'ఛలో తాడేపల్లి'కి అనుమతి నిరాకరణ
- ఎల్లుండి ఛలో తాడేపల్లి
- అనుమతి లేదన్న గుంటూరు ఎస్పీ
- 144 సెక్షన్ అమల్లో ఉందని వివరణ
- విద్యార్థులు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకోవాలని వెల్లడి
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారి పనులకు ఆటంకం కలిగించడం నేరం అని ఎస్పీ పేర్కొన్నారు. సీఎంవో, రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం ముట్టడించడం నేరం అని వివరించారు. నిరుద్యోగుల ముసుగులో సంఘవిద్రోహ శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.
మరోవైపు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా ఆందోళన చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు.