Allu Arjun: వర్షం కారణంగా ఆగిన 'పుష్ప' షూటింగ్!

Pushpa shooting is stopped due to rain
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' రూపొందుతోంది. కరోనా కారణంగా మొన్న మొన్నటివరకూ ఈ సినిమా షూటింగు ఆపేశారు. ఆ తరువాత కరోనా ప్రభావం తగ్గడంతో రంగంలోకి దిగిపోయారు. 45 రోజుల షెడ్యూల్ ను పకడ్బందీగా ప్లాన్ చేశారు. షూటింగు మొదలుపెట్టిన తరువాత ఆగకుండా నాన్ స్టాప్ గా జరపాలని నిర్ణయించుకున్నారు. అందువలన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెట్లు కూడా పూర్తయిన తరువాత రీసెంట్ గా రంగంలోకి దిగారు. అయితే ఈ సారి వర్షం కారణంగా షూటింగు ఆగిపోయినట్టుగా చెబుతున్నారు.

హైదరాబాద్ లో కొన్ని రోజులుగా  పడుతున్న వానల కారణంగా 'పుష్ప' కోసం ఓపెన్ ఏరియాలో వేసిన సెట్లు దెబ్బతిన్నాయట. అందువలన ప్రస్తుతానికి షూటింగు ఆపేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ కారణంగా ఈ షెడ్యూల్ కొంత ఆలస్యంగా పూర్తికావొచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగులో ఫాహద్ ఫాజిల్ పాల్గొననున్నాడు. ఆల్రెడీ ఆయన హైదరాబాద్ వచ్చాడని చెబుతున్నారు. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, ఐశ్వర్య రాజేశ్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Aishwarya Rajesh

More Telugu News