Bandi Sanjay: పాద‌యాత్ర‌పై బండి సంజ‌య్ కీల‌క భేటీ

bandi sanjay slams trs
షార్ట్స్‌లో చూడండి
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఎల్లుండి నుంచి బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభిస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఇందుకు సిద్ధ‌మ‌య్యేందుకు ఈ రోజు బండి సంజ‌య్ అధ్య‌క్ష‌త‌న హైద‌రాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు.

పాద‌యాత్ర రూట్‌మ్యాప్‌పై చ‌ర్చిస్తున్నారు. ఇందులో రాజాసింగ్, ర‌ఘునంద‌న్‌రావు, జితేందర్‌రెడ్డి, విజ‌య‌శాంతి, డీకే అరుణ‌, వివేక్ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో హుజురాబాద్ నేత‌లు కూడా పాల్గొనే అవ‌కాశం ఉంది. హుజురాబాద్‌లో ఈటల రాజేంద‌ర్ గెలుపే ల‌క్ష్యంగా బండి సంజయ్ చేయ‌నున్న‌ పాదయాత్ర‌లో ప‌లువురు బీజేపీ నేత‌లు పాల్గొన‌నున్నారు.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
Telangana

More Telugu News