L Ramana: మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ స‌భ్య‌త్వం తీసుకున్న ఎల్‌.ర‌మ‌ణ‌

  L Ramana  joins in TRS
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ తెలంగాణ‌ పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన ఎల్.రమణ ఈ రోజు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఆయ‌న‌కు స‌భ్య‌త్వం ఇచ్చిన కేటీఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాల‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు టీఆర్ఎస్ నేత‌లు పాల్గొన్నారు.

ఎల్‌.ర‌మ‌ణ‌తో పాటు ప‌లు సంఘాల నేత‌లు, ఆయ‌న‌ మ‌ద్ద‌తుదారులు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. పార్టీ మార‌డంపై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవ‌ల‌ ర‌మ‌ణ చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న ఎల్.ర‌మ‌ణ ఆ పార్టీలో త‌న ప్ర‌స్థానాన్ని ముగించారు.  
Go Back to Shorts
L Ramana
TRS
Telugudesam

More Telugu News