హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీజేఎస్ పోటీ: కోదండరామ్ ప్రకటన
- ఆగస్టు నెలాఖరులో పార్టీ ప్లీనరీ సమావేశం
- టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని తప్పుడు ప్రచారం
- లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో ప్రభుత్వం చెప్పాలి
తమ పార్టీ ఆగస్టు నెలాఖరులో ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు కోదండరామ్ తెలిపారు. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందులో విలీనం చేసే ప్రసక్తే లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.