VV Vinayak: హిందీ 'ఛత్రపతి' కోసం రాజమౌళిని కలవనున్న వినాయక్!

  • సెట్స్ పై 'ఛత్రపతి' హిందీ రీమేక్
  • కథలో కొన్ని మార్పులు .. చేర్పులు
  • అదే బ్యానర్లో వినాయక్ మరో మూవీ 
  • త్వరలోనే పూర్తి వివరాలు
Vinayak will meet Rajamouli soon

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్లలో 'ఛత్రపతి' ఒకటి. ప్రభాస్ స్టార్ డమ్ ను .. మాస్ ఆడియన్స్ లో ఆయన క్రేజ్ ను అమాంతంగా పెంచిన సినిమా ఇది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించారు. 2005లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పెన్ మూవీస్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాను గురించి, తాజాగా వినాయక్ మాట్లాడారు.

''హిందీ రీమేక్ 'ఛత్రపతి' కోసం కూడా విజయేంద్రప్రసాద్ గారు పనిచేస్తున్నారు. బాలీవుడ్ ఆడియన్స్ టేస్టుకు తగినట్టుగా  ఆయన కొన్ని మార్పులు .. చేర్పులు చేశారు. రాజమౌళి బిజీగా ఉండటం వలన ఆయనను కలవడం కుదరలేదు. ఈ సినిమా విషయంపై త్వరలో ఆయనతో కూర్చోవాలి. 'ఛత్రపతి' సినిమాను రీమేక్ చేయాలని నేను అనుకోలేదు. పెన్ మూవీస్ వారే వచ్చారు'' అన్నారు వినాయక్. ఇదే బ్యానర్లో మరో సినిమాను కూడా చేయనున్నట్టు చెప్పారు. త్వరలో ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను వెల్లడిస్తానని అన్నారు.

More Telugu News