తెలంగాణలో గత 24 గంటల్లో 729 మందికి కరోనా పాజిటివ్
- తాజాగా 1,06,045 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
- ఖమ్మం జిల్లాలోనూ 72 మందికి కరోనా
- నిర్మల్ జిల్లాలో కొత్త కేసులు నిల్
- రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురి మృతి
అదే సమయంలో 987 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,720కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 6,30,514 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,15,852 మంది కొవిడ్ నుంచి విముక్తులయ్యారు. ఇంకా 10,942 మంది చికిత్స పొందుతున్నారు.
