ఏపీలో మరో 2,982 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 91,070 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 616 కేసులు
- అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 32 కేసులు
- రాష్ట్రంలో 27 మరణాలు
- ఇంకా 31,850 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 19,14,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 18,69,417 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 31,850 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 12,946కి పెరిగింది.