తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona new cases decreased drastically in Telangana
  • 24 గంటల్లో 772 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురి మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,472
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 772 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 88 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో 86 కేసులతో ఖమ్మం జిల్లా ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది.

ఇదే సమయంలో కరోనా బారిన పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 6,29,054కి చేరుకుంది. 6,13,872 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,710 మంది కరోనాతో మృతి చెందారు.



Telangana
Corona Virus
Updates

More Telugu News