పోలవరం నిర్వాసితుల సమస్యలపై విపక్షాల నిరసన దీక్ష
- విజయవాడలో నిరసన దీక్ష
- హాజరైన సీపీఐ, సీపీఎం, టీడీపీ నేతలు
- నిర్వాసితులను తరిమేస్తున్నారని ఆగ్రహం
- ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక
సీపీఎం అగ్రనేత మధు స్పందిస్తూ, 15 రోజల్లోగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 7న ముంపు మండలాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్టు వెల్లడించారు. మాజీ ఎంపీ, రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, పునరావాసం కల్పించకుండా నిర్వాసితులను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.