ఏపీ కరోనా అప్ డేట్స్: కొత్తగా 3,464 పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 93,759 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 667 మందికి కరోనా
- అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 కేసులు
- రాష్ట్రంలో 35 మంది మృతి
అదే సమయంలో 4,284 మంది కరోనా నుంచి కోలుకోగా, 35 మంది మృత్యువాతపడ్డారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,779కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 18,96,818 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,46,716 మంది కోలుకున్నారు. ఇంకా 37,323 మంది చికిత్స పొందుతున్నారు.