అర్థరహిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలకు విలువ లేకుండా చేస్తున్నారు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిపై మ‌ల్లు ర‌వి ఆగ్ర‌హం

mallu ravi slams jeevan reddy
  • రేవంత్ పై జీవన్ రెడ్డి విమర్శలు   
  • జీవన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్న రవి  
  • అప్ప‌ట్లో కేసీఆర్ కూడా టీడీపీ నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చారు
టీపీసీసీ కొత్త అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఖైదీ నంబర్ 1799 అని, పదవులు వచ్చిన వారు హుందాగా ఉండాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ మ‌ల్లు ర‌వి మండిప‌డ్డారు. జీవన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

ఇటువంటి అర్థరహిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలకు విలువ లేకుండా చేస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచే కాంగ్రెస్ లోకి వచ్చి  ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడ‌ని, అప్ప‌ట్లో  కేసీఆర్ కూడా టీడీపీ నుంచే వ‌చ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అనంత‌రం టీఆర్ఎస్‌కు కేసీఆర్ అధ్యక్షుడు అయ్యారని చెప్పారు.
Go Back to Shorts
Jeevan Reddy
mallu ravi
Congress

More Telugu News