బ్యాడ్మింటన్ అకాడమీ కోసం సింధుకు రెండెకరాల స్థలం
- విశాఖలో కేటాయించిన ప్రభుత్వం
- ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులకు అభినందనలు
- ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందజేత
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలను తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎంవో ప్రకటనను విడుదల చేసింది. మరింత మంది క్రీడాకారులకు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. అందులో భాగంగా విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం పి.వి. సింధుకు 2 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.