తెలంగాణలో వెయ్యికి దిగువగా రోజువారీ కరోనా కేసులు
- తెలంగాణలో బాగా నెమ్మదించిన కరోనా
- గత 24 గంటల్లో 748 కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 121 కేసులు
- మూడు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- రాష్ట్రంలో 8 మంది మృతి
అదే సమయంలో 1,492 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,20,613 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,02,676 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,302 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో మొత్తం 3,635 మంది మరణించారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 97.10 శాతానికి పెరిగింది.
