అమెరికా వెళ్లే విద్యార్థులకు ఊరట.. గడువు 25 రోజుల పొడిగింపు
- జులై నెల వీసా కోటాను విడుదల చేసిన అమెరికా కాన్సులేట్
- ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న వర్సిటీలతో సంప్రదించి తేదీలు తెలుసుకోవాలని సూచన
- ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా ఏర్పాట్లు
కరోనా కారణంగా భారత్‌లో వీసా ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోని కాన్సులేట్ల ద్వారా విద్యార్థి వీసా ఇంటర్వ్యూల ప్రక్రియను ఈ నెల 14 నుంచి ప్రారంభించాయి. మరోవైపు, నిన్న జులైకి సంబంధించిన వీసా కోటాను కూడా విడుదల చేయడంతో విద్యార్థులు స్టాట్స్ పొందారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా కాన్సులేట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.