Nidhi Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో రెండు సినిమాలలో నిధి అగర్వాల్ 
  • జీటీవీకి 'రాధే శ్యామ్' శాటిలైట్ హక్కులు
  • 'మాస్ట్రో'కి హాట్ స్టార్ నుంచి 32 కోట్లు
  • కమేడియన్ సప్తగిరి హీరోగా మరో సినిమా    
Nidhi Agarwal signs two more films in Tamil

*  ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ కి తమిళంలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ అక్కడ రెండు సినిమాలు కమిట్ అయినట్టు సమాచారం.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రాధే శ్యామ్'కు సంబంధించిన శాటిలైట్ హక్కులను జీటీవీ భారీ రేటుకి సొంతం చేసుకుంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను కూడా జీ స్టూడియోస్ ఇప్పటికే పొందింది.
*  యువ కథానాయకుడు నితిన్ తాజాగా నటించిన 'మాస్ట్రో' చిత్రం డైరెక్టు రిలీజ్ హక్కులను ఓటీటీ సంస్థ హాట్ స్టార్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకుగాను సదరు సంస్థ 32 కోట్లను చెల్లించినట్టు చెబుతున్నారు.    
*  ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కె.ఎమ్.కుమార్ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. నేహా సోలాంకి కథానాయికగా సంగీత దర్శకుడు రఘు కుంచె విలన్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది.  

More Telugu News