తెలంగాణలో కొత్తగా 1,061 మందికి కరోనా పాజిటివ్
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 1,061 మందికి కరోనా పాజిటివ్

Telangana Covid cases
  • గత 24 గంటల్లో 1,20,397 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 135 కేసులు
  • రాష్ట్రంలో 11 మరణాలు
  • ఇంకా 15,524 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,397 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,061 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 135 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 80, సూర్యాపేట జిల్లాలో 67, రంగారెడ్డి జిల్లాలో 66, నల్గొండ జిల్లాలో 65 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,556 మంది కోలుకోగా, 11 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,618కి పెరిగింది. తెలంగాణలో ఇప్పటివరకు 6,18,837 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,99,695 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,524 మందికి చికిత్స జరుగుతోంది.
Telangana
New Cases
Deaths
Daily Cases

More Telugu News