హుజూరాబాద్ ఉపఎన్నిక.. బీజేపీ ఇన్ఛార్జులను నియమించిన బీజేపీ
- ఈటల రాజీనామాతో హుజూరాబాద్ కు ఉపఎన్నిక
- మండలాలకు ఇన్ఛార్జిలను నియమించిన బీజేపీ
- నియోజకవర్గ కోఆర్డినేటర్ గా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
మరోవైపు, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం మండల ఇన్ఛార్జిలను బీజేపీ నియమించింది. హుజూరాబాద్ టౌన్ ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజూరాబాద్ రూరల్ కు రేవూరి ప్రకాశ్ రెడ్డి, జమ్మికుంటకు ఎంపీ అరవింద్, జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, వీణవంకకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇల్లంతకుంటకు మాజీ ఎంపీ సురేశ్ రెడ్డి, కమలాపూర్ కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ లను నియమించారు. నియోజకవర్గ కోర్డినేటర్ గా బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని నియమించింది.