ఇక కరోనా వైరస్ ఏదైనా ఒకటే వ్యాక్సిన్.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
- యూనివర్సల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆవిష్కరణ
- అభివృద్ధి చేసిన నార్త్ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
- ఎలుకలపై జరిపిన పరిశోధనలో రుజువైన సమర్థత
- భవిష్యత్ మహమ్మారులను దృష్టిలో పెట్టుకుని టీకా అభివృద్ధి
అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. జంతువుల నుంచి మానవులకు సోకే కరోనా వైరస్ కుటుంబానికి చెందిన ఇతర వైరస్‌లను ఎదుర్కొనేలా దీనిని అభివృద్ధి చేశారు. ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ యూనివర్సల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ సమర్థత వెల్లడైంది. ప్రమాదకర వేరియంట్లను ఎదుర్కొనేందుకు ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.